AP: సంక్రాంతి పండగ సందర్భంగా కుటుంబ సభ్యులు స్నేహితులతో టూర్లకు వెళ్లే పర్యాటకుల కోసం ఏపీ టూరిజం శాఖ కొత్త సౌకర్యాన్ని ప్రవేశపెట్టనుంది. క్యారవాన్ టూర్లను మొదట 4 మార్గాల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం 4 వాహనాలను అందుబాటులో ఉంచింది. ఈ ప్యాకేజీ ద్వారా పర్యాటకులు క్యారవాన్‌లో ప్రయాణిస్తూ రాష్ట్రంలోని ప్రసిద్ధ పర్యాటక స్థలాలను చూడవచ్చు.