TPT: టీడీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.10 లక్షలు విరాళం అందింది. దాత వి. వెంకట నాగరాజ శర్మ సదరు డీడీని టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌కు మంగళవారం అందించారు. దాత వి. వెంకట నాగరాజ శర్మ శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వేదపారాయణదారుగా పనిచేస్తున్నారు.