BPT: ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రమాదాల నుంచి రక్షణ పొందాలని బాపట్ల రవాణా శాఖ అధికారి రంగారావు చెప్పారు. మంగళవారం బాపట్ల పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా వాహనదారులకు హెల్మెట్‌పై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం వలన కలిగే ఉపయోగాలను తెలియజేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో పట్టణ సీఐ రాంబాబు పాల్గొన్నారు.