CTR: చౌడేపల్లె పోలీస్ స్టేషన్ను మదనపల్లె DSP మహేంద్ర మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ కేసుపై విచారణ చేపట్టారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీఐ రాంభూపాల్ రెడ్డి, ఎస్ఐ నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.