TG: తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 200 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్నామన్నారు. ఇప్పుడు ఏమీ చేయకున్నా.. 2047 వరకు 1.2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతామన్నారు. కానీ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్తున్నామన్నారు.