ADB: రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో మున్సిపల్ ఎన్నికలు, ఓటర్ల జాబితా సవరణ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని కలెక్టర్ సూచించారు.