TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావు సిట్ విచారణ ముగిసింది. SIB మాజీ అధికారులతో సంబంధాలపై సిట్ ఆరా తీసింది. గతేడాది సెప్టెంబర్లో విచారణకు హాజరయ్యానని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కూడా విచారణకు సహకరించానని తెలిపారు. తాను పరికరాలు సరఫరా చేశానన్న ప్రచారంపై విచారణలో చర్చకు రాలేదని పేర్కొన్నారు.