ADB: నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్ గ్రామంలో ఈ నెల 10వ తేదీ నుంచి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ సందర్బంగా విజేత జట్టులకు ప్రథమ బహుమతిగా రూ. 30,000, ద్వితీయ బహుమతిగా రూ.15,000 ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దీంతో ఇంద్రవెల్లి, ఉట్నూర్, జైనూర్, నార్నూర్, లింగాపూర్ మండలాల్లోని క్రీడాకారులు హాజరై విజయవంతం చేయాలనీ వారు కోరారు.