NRPT: మక్తల్-NRPT-కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం భూములిచ్చిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు. భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెక్కులను నిన్న పంపిణీ చేశారు. రానున్న 2 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామన్నారు. ముందు ఎకరాకు రూ.14 లక్షల పరిహారం ప్రతిపాదించినప్పటికీ, రైతుల విన్నపం దృష్టిలో పెట్టుకుని పరిహారం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.