MDK: పాపన్నపేట మండలం లింగాయపల్లి గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు సోమవారం దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 5 మందిని అరెస్ట్ చేసి రూ.26,183 నగదును స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.