VZM: జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో 73 బోధనేతర పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు అదనపు పథక సమన్వయకర్త ఎ. రామారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు ఈనెల 06 నుండి 20లోపు ఆఫ్లైన్లో సమర్పించాలని, ఎంపిక ఇంటర్వ్యూల ద్వారా జరుగుతుందన్నారు.