కృష్ణా: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అడ్డుగా ఉన్న సమస్యలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ డీ. కే. బాలాజి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలోని పారిశ్రామిక యూనిట్ల పురోగతి, పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షించారు.