BPT: పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులకు మంగళవారం తెలిపారు. గ్రామాల్లో ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాలని, ఈ ప్రక్రియను పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పరిస్థితిని పరిశీలించేందుకు తానే స్వయంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తానని పేర్కొన్నారు.