అమెరికాకు వెనిజులా తాత్కాలిక ప్రభుత్వం నుంచి 30-50 మిలియన్ బ్యారెళ్ల చమురు రానుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనకు సంబంధించిన ‘ట్రూత్ సోషల్’లో వెల్లడించారు. ఈ ఆయిల్‌ను మార్కెట్ రేటుకు విక్రయించి, వచ్చిన డబ్బును తన కంట్రోల్లోనే ఉంచుకుంటానని చెప్పారు. ఆ నిధులను అమెరికా, వెనిజులా ప్రజల బాగోగుల కోసమే వినియోగిస్తామని స్పష్టం చేశారు.