NZB: జాతీయస్థాయి విలువిద్య పోటీలకు డొంకేశ్వర్ మండలం తొండాకూరు గ్రామానికి చెందిన శ్రీనిక ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే 69వ జాతీయస్థాయి పోటీలకు అండర్-7 విభాగంలో ఆమె పాల్గొంటుంది. ఈ పోటీలు ఈనెల 6 నుంచి 10 వరకు జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచిలో జరగనున్నాయి.