VSP: సాగర్‌నగర్, ముసలయ్యపాలెం పరిసరాల్లో సోమవారం సినీ సందడి నెలకొంది. యువ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెహర్ ఎర్మాటీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ మేరకు ప్రముఖ నటుడు బాబీ సింహా, కథానాయికలు హెబ్బా పటేల్, అన్వీషాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.