MBNR: గండీడ్ మండల కేంద్రానికి చెందిన మోర కేశవులు అకాల మరణంతో పదో తరగతి స్నేహితులు పార్థివదేహానికి నివాళులర్పించారు. కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో పలువురు స్నేహితులు పాల్గొన్నారు.