KMM: జిల్లా కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో అదనపు కలెక్టర్ శ్రీజ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన పథకం అమలు, విద్యార్థుల విద్యా ప్రమాణాలపై చర్చించారు. ముఖ్యంగా పదో తరగతి పరీక్షల దృష్ట్యా విద్యార్థులను సన్నద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.