కడప జిల్లాలో ప్రభుత్వం సివిల్ సప్లైస్ శాఖ ద్వారా రైతుల వద్ద నుంచి గిట్టుబాటు ధరతో ఖరీఫ్ సీజన్లో 4,416.360 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసింది. డిసెంబర్ నెలలో 21 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. వ్యవసాయ శాఖ సిబ్బంది, DCMSల ద్వారా జిల్లాలో 698 మంది రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేపట్టింది. క్వింటాకు రూ.2369 గిట్టుబాటు ధర ధర కల్పించింది.