సత్యసాయి: ధర్మవరం రాజకీయం త్వరలో మరింత వేడెక్కనుంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తిరిగి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రెండేళ్ల విరామం తర్వాత తన పట్టు నిలుపుకునేందుకు ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించనున్నారు. తనపై వచ్చిన విమర్శలకు క్షేత్రస్థాయిలో చెక్ పెట్టాలన్న యోచనలో కేతిరెడ్డి ఉన్నట్లు కనిపిస్తోంది.