KKD: ఈ నెల 9న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం మున్సిపల్ పాఠశాల ఆవరణంలో సంక్రాంతి సంబరాలలో పాల్గొనే ప్రదేశాన్ని జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ పరిశీలించారు. సభా వేదిక, స్టాల్స్ ఏర్పాట్లు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పవన్ పర్యటన దృష్ట్యా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.