MNCL: మంచిర్యాలకు చెందిన సంజయ్ ABVP రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియామకమయ్యాడు. జనవరి 3, 4,5తేదీలలో శంషాబాద్లో నిర్వహించిన 44వ రాష్ట్ర మహాసభల్లో ఈ నియామకం చేపట్టారన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు నిరంతరము కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థులను జాతీయ వాదులుగా తీర్చిదిద్దుతామన్నారు.