VKB: వికారాబాద్–కృష్ణా మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన ఫీల్డ్ సర్వే పూర్తయిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సుమారు 130 కిలోమీటర్ల నేరుగా అనుసంధానించే మార్గానికి క్షేత్రస్థాయి సర్వే ముగిసిందన్నారు. డీపీఆర్ పూర్తయ్యాక రాష్ట్ర ప్రభుత్వం, ఇతర భాగస్వామ్యాలతో చర్చించి ప్రాజెక్టుకు మంజూరు చేస్తామన్నారు.