NZB: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు ‘వన్ టైమ్ ఎగ్జామ్స్ ఛాన్స్’ ఫీజు చెల్లింపు గడువును ఈనెల 20 వరకు పొడిగించినట్లు సీఓఈ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. 2016-2020 మధ్య చేరిన బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ విద్యార్థులు తమ పెండింగ్ సెమిస్టర్ల (1 నుంచి 6 వరకు) పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అపరాధ రుసుంతో ఈనెల 27 వరకు అవకాశం ఉందన్నారు.