VZM: ఎల్ కోట మండలం లచ్చంపేటలో శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి బుధవారం పాల్గొన్నారు. రైస్ మిల్ ప్రారంభం కావడంవల్ల రైతులు పండించిన పంటలకు సరైన మద్దతు ధర పొందటమే కాకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలాజీ రాంప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు.