TG: ఓ వ్యక్తి తన భార్య వంట చేయడం లేదని, తనకు విడాకులు మంజూరు చేయాలని హైకోర్టులో అప్పీల్ చేశాడు. హైదరాబాద్ ఎల్బీనగర్కు చెందిన వ్యక్తి తన భార్య వంట చేయడం లేదని, తన తల్లి వంట చేసేటప్పుడు సహకరించడం లేదని కోర్టుకు విన్నవించాడు. భర్త దాఖలు చేసిన విడాకుల అప్పీల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. భార్య వంట చేయకపోవడం క్రూరత్వం కిందికి రాదని తేల్చి చెప్పింది.