ATP: జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా వడ్డె వెంకట్‌ను నియమిస్తూ బుధవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల విద్య, గ్రంథాలయాల విభాగం కార్యదర్శి కోన శశిధర్ ఈ మేరకు నియామకపు జీవో విడుదల చేశారు. నియామకంపై గత నెలలోనే స్పష్టత వచ్చినప్పటికీ జీవో రావడంలో జాప్యం జరగడంతో బాధ్యతల స్వీకరణలో ఆలస్యమైంది.