MNCL: రామకృష్ణాపూర్ మీదుగా మందమర్రి- మంచిర్యాల ఆర్టీసీ బస్సును బుధవారం రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. కొంతకాలంగా మంచిర్యాలకు బస్సు సౌకర్యం లేక స్థానికులు ఎన్నో అవస్థలు పడ్డారు. మంత్రి చొరవతో బస్సు ప్రారంభం కావడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, తదితరులు పాల్గొన్నారు.