విశాఖ స్టీల్ ప్లాంట్‌కు చెందిన 2500 ఎకరాల భూమిని ప్రైవేట్ కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రతిపాదనలను చంద్రబాబు కూటమి ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఇవాళ కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం మాట్లాడుతూ.. భూములు ప్లాంట్ విస్తరణకే ఉపయోగించాలని, కార్మికుల తొలగింపులు, వీఆర్ఎస్, భూముల లీజులు కుట్రగా మారాయని విమర్శించింది.