యాషెస్ చివరి టెస్టులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 384 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 567 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ధాటిగా బదులిస్తోంది. యువ సంచలనం జాకబ్ బెథెల్ సెంచరీ పూర్తి చేసుకుని 106 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం ENG 219/4 పరుగులు చేసి, 36 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.