BPT: తండ్రి కొట్టాడని ఇంటి నుంచి వెళ్లిపోయిన చీరాలకు చెందిన పదేళ్ల పూర్ణ అనే బాలుడు తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు. మంగళవారం సాయంత్రం బాలుడు తిరుపతిలోని గరుడ వారధి వద్ద ఒంటరిగా కూర్చుని ఉండగా స్థానికులు అలిపిరి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. తండ్రి శ్రీను తాపీ మేస్త్రి అని, తల్లి పేరు అంకమ్మ, సోదరుని పేరు మణికంఠ అని మాత్రమే ఆ బాలుడు చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు.