BDK: పినపాక మండలం ఈ బయ్యారంలో అండర్ 17 జాతీయ బాలుర కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి బుధవారం క్రీడా ప్రాంగణాన్ని చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.