NLG: పురపాలక ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఓటర్ల జాబితాలో అక్రమాలను అరికట్టేందుకు కొత్త నమోదును నిలిపివేసింది. గ్రామీణ ఓటర్లు పట్టణ జాబితాల్లో చేరకుండా ప్రత్యేక సాఫ్ట్వేర్ను వాడుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టింది.