SRPT: అమరుడా నీ మరణం మరువలేనిది, ప్రజల కోసం పనిచేసే నాయకులు చనిపోయినప్పటికీ వారు ఎల్లప్పుడూ ప్రజల హృదయాల్లో జీవించే ఉంటారని, సీపీఐ జాతీయ నాయకులు, జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ అన్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామంలో దివంగత సీపీఐ నాయకులు పోటు ప్రసాద్ స్థూపాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు.