E.G: రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పని చేస్తున్న సీనియర్ నాయకుడు బాలేపల్లి మురళీధర్‌ను మరోసారి కొనసాగించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. నాలుగవసారి ఆయనను సిటీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. ఆయన గతంలో రెండుసార్లు పీసీసీ కార్యదర్శిగా పని చేశారు.