KMR: డోంగ్లీ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డోంగ్లీ ఉప సర్పంచ్ శివాజీ రామరావు పటేల్ ఆకస్మికంగా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సోమవారం వారి గ్రామానికి వెళ్లి, శివాజీ రామరావు పటేల్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.