BHNG: గుర్రపు డెక్క ఆకు తొలగింపుతో రైతులకు కాల్వ ద్వారా సాగునీరు అంది ఊరట కలుగుతుందని మాజీ ఎంపీపీ యర్కల సుధాకర్ గౌడ్ అన్నారు. బీబీనగర్ మండల పరిధిలోని చిన్నరావులపల్లి గ్రామ శివారులో గ్రామ సర్పంచ్ కొమిరె శ్రీకాంత్ తన సొంత నిధులతో పెద్ద కాల్వకు ఇరువైపులా పేరుకుపోయిన గుర్రపు డెక్క ఆకు, కంప చెట్ల తొలగింపు పనులను మంగళవారం ప్రారంభించారు.