జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పరిధిలో చైనా మాంజా విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చైనా మాంజాతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉందని, దీనివల్ల తలెత్తే అనర్థాలపై అందరికీ అవగాహన ఉండాలని ఆయన అన్నారు.