కలబందతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మంపై మంట, మొటిమలు, ముడతలు, మచ్చలు తగ్గించి, చర్మాన్ని తేమగా ఉంచుతుంది. చిన్న గాయాలు, కాలిన గాయాలు త్వరగా మానడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలను నివారిస్తుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.