ATP: ఈ నెల 9న జబర్దస్త్ నటుడు శాంతి కుమార్ పెద్దవడుగూరు రానున్నట్లు సోషల్ ఆటిట్యూడ్ రెస్పాన్సిబిలిటీ యూత్ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు జంగం శ్రీనివాస్ తెలిపారు. మండల కేంద్రంలో నిర్వహించే ‘మన ఊరి పాటల సయ్యాట’ కార్యక్రమానికి ఆయన విశిష్ట అతిథిగా హాజరవుతారన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కళాకారులు పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.