AP: విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటుపై కీలక ముందడుగు పడింది. రైల్వే జోన్ కార్యాలయాల నిర్వహణకు అవసరమైన ఉద్యోగుల కేటాయింపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు 959 మంది ఉద్యోగులను బదిలీ చేయాలని నిర్ణయించారు. జోన్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ బదిలీలు చేపట్టనున్నారు. ఈ జోన్ ఏర్పాటుతో ఉద్యోగావకాశాలు, రైల్వే సేవలు మరింత మెరుగుపడనున్నాయి.