పెద్దపల్లి సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆదేశానుసారం ఈనెల 7న అందుల ఆశాజ్యోతి లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాలరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళ, శిశు, వికలాంగ, అందులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొంటారన్నారు.