NLG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు చిట్యాలలో ఆ పార్టీ శ్రేణులు ఇవాళ ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఖమ్మం వెళుతున్న క్రమంలో చిట్యాలలో ఆగి కార్యకర్తలకు అభివాదం చేశారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పుష్పగుచ్చం అందజేసి సత్కరించారు.