AP: మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఏనుగులు హల్చల్ చేసి ధాన్యం బస్తాలను ధ్వంసం చేశాయి. ఈ ఘటనపై స్పందించిన మంత్రి సవిత.. జిల్లా కలెక్టర్, అధికారులకు కాల్ చేసి వివరాలు తెలుసుకున్నారు. నష్టపోయిన రైతుల పంట పరిహారంపై అంచనా వేయాలని ఆదేశించారు. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. అటు పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు.