సత్యసాయి: భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తన అభిమాన క్రికెటర్ రోహిత్ శర్మను కలిశారు. ఇటీవలే తొలి టీ20 వరల్డ్ కప్ గెలిచిన దీపిక నేతృత్వంలోని జట్టును రిలయన్స్ ఫౌండేషన్ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా రోహిత్ దీపికను అభినందించారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన దీపిక.. రోహిత్ శర్మ కెప్టెన్సీని స్ఫూర్తిగా తీసుకుని జట్టును విజయపథంలో నడిపారు.