SRPT: బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీసుల లక్ష్యమని ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్డేలో ఆయన 10 ఫిర్యాదులను స్వీకరించారు. అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఆదేశాలిచ్చారు. ఇన్వెస్టిగేషన్లో అలసత్వం వహించరాదని, పారదర్శకత పాటించాలని సూచించారు.