KNR: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతోపాటు తప్పిపోయిన, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పిల్లలను రక్షించాలని ఆడిషినల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అశ్విని తానాజీ వాకడే సూచించారు. బాల కార్మికుల నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమాన్ని అధికారులు అందరూ విజయవంతం చేయాలని ఆమె పేర్కొన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు.