AP: రాజధాని కోసం భూసమీకరణ 2.0 ప్రారంభమైన వేళ అమరావతికి చట్టబద్ధతపై రైతులు ప్రభుత్వాన్ని నిలదీశారు. మంత్రి నారాయణ, తాడికొండ MLA శ్రావణ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. 3 ఏళ్లలో అభివృద్ధి జరుగుతుందని రాసిస్తారా? రేపు ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తొలి విడతలో ఎంత అభివృద్ధి చేశారని నిలదీశారు. రాజధానికి చట్టబద్ధత ఉందని మంత్రి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.