MNCL: లక్షెట్టిపేట మండలంలోని చిట్యాల కుంట కాలువ చదును పనులు ప్రారంభమయ్యాయి. కడెం ప్రాజెక్టు, గూడెం లిఫ్ట్ నుంచి వచ్చే నీరు చిట్యాల కుంట వద్ద నుంచి ఎల్లారం వరకు చేరుకుంటుంది. దీంతో కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చి మొక్కల తొలగింపు పనులను ప్రజా ప్రతినిధులు, అధికారులు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నలిమేల రాజు, తదితరులు పాల్గొన్నారు.