MBNR: రాజాపూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి ‘ఇండియా 1’ ఏటీఎంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు, ఇటుకలతో ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. బుధవారం ఉదయం ఎస్సై శివానంద గౌడ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.